Press ESC to close

WPL 2024 విజేత ఆర్సీబీ… ఫ్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

WPL 2024 Winner RCB: విమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ విజేతగా బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ టీమ్‌ ఆవిర్భవించింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మరో 3 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. ఇది బెంగళూరుకు తొలి WPL టైటిల్‌.


డబ్ల్యూపీఎల్‌ విజేత RCBకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన Delhi క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

ఆరెంజ్‌ క్యాప్‌ విజేత పెర్రీ.. ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది.

పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ శ్రేయంక. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది.






మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే..
ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌-దీప్తి శర్మ
ఎమర్జింగ్‌ ప్లేయర్‌  – శ్రేయాంక పాటిల్‌ (బెంగళూరు) 
మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌  – దీప్తి శర్మ (యూపీ) 
బెస్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద టోర్నీ – సజన సజీవన్‌ (ముంబై) 
ఫెయిర్‌ ప్లే టీమ్‌ – రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *